Revanth Reddy: సమగ్ర కుటుంబ సర్వేలో సీఎం పేరు నమోదు..! 24 d ago
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించుకున్నారు. సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.